వర్షాకాలంలో నేత్ర సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కళ్లు పొడిబారడం, కండ్ల కలక, కంటి కురుపు వంటి ఇన్ఫెక్షన్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే, ఒకరి నుంచి మరొకరికి సోకిపోయి చాలా ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్లో వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. ఏ వస్తువును తాకినా చేతులు కడుక్కోవాలి.
ఈతకు వెళ్లకపోవడమే ఉత్తమం. వీలైతే, కళ్లజోడు ధరించాలి. ఉతికిన కర్చీఫ్లనే వాడాలి. కాంటాక్ట్ లెన్స్‌ను మార్చుకునే ముందు తగిన రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి. ఒకరి తువ్వాలు మరొకరు వాడకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు పెరుగుతాయి. టిష్యూ పేపర్ల వాడకం ఉత్తమం.