Is your password secure | ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ను ఉపయోగించడం సులువే ! కానీ మన వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల బారిన పడకుండా చూసుకోవడమే కష్టం !! బ్యాంకు అకౌంట్లతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ రకరకాల సోషల్ మీడియా అకౌంట్లు ఉండటంతో అన్ని పాస్వర్డ్లు గుర్తుంచుకోలేక.. చాలామంది ఒకేరకమైన పాస్‌వర్డ్‌లను అన్నింటికీ పెడుతున్నారు. గుర్తుండాలని ఈజీ పాస్వర్డ్లు పెడుతున్నారు సరే.. మరి అవి సురక్షితంగా ఉన్నాయా? లేదా ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయా? అన్న విషయం మీకు తెలుసా ! తెలియదు కదూ !! మరి మీ పాస్వర్డ్ హ్యాకర్ల బారిన పడిందో లేదో ఎలాగో తెలుసుకోవాలని ఉందా !! దీనికోసం గూగుల్ క్రోమ్ ( Google chrome ) లో ఒక ఫీచర్ ఉంది. దీని ద్వారా అసలు మీ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అన్న విషయం తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పడు చూద్దాం..
మీ పాస్వర్డ్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకునేందుకు గూగుల్ క్రోమ్ ( Google chrome ) బ్రౌజర్లో ఒక సదుపాయం ఉంది. ఇది డెస్క్‌టాప్ బ్రౌజర్, మొబైల్ బ్రౌజర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా మీ పాస్వర్డ్ హ్యాకింగ్‌కు గురైందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్ క్రోమ్‌లో మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. అంతేకాకుండా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు.. బ్యాంకు ఖాతాలు గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి. వాటి పాస్‌వర్డ్‌లను గూగుల్ ఖాతాలో సేవ్ చేయడం తప్పనిసరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
యూజర్ చనిపోతే గూగుల్ డేటా ఏమవుతుంది? ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాల సంగతేంటి?
Free wifi : ఉచిత వైఫై తీసుకుంటున్నారా? అయితే, మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్లే..! ఎలాగంటే..
Data Stealing : ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!