మోటదార్లు/ మోటబార్లు = ఎడ్ల సాయంతో బావి నుంచి నీటిని పైకి తోడే వ్యవస్థ
(మోటబావి కాడ ఎడ్లతో కలిసి తిరిగితే.. పెయ్యంతా నొప్పులే!)
తోసు పోకుండా = తప్పులు లేకుండా (ఏదైనా పనిలో, మాట్లాడటంలో, రాయడంలో తప్పులు లేకుండా చేస్తే
తోసు పోకుండా చేస్తడు అంటారు)
అమాన్ కల్లు = కల్లు డిపోల కోసమే ప్రత్యేకంగా గీసే కల్లు (అడవుల్లో గీసే అమాన్ కల్లు ఊర్లో అమ్మొద్దని ఊరిపెద్ద సాటింపు
వేయించిండట)
పాషాణుడు = కఠిన హృదయం కలిగిన వాడు, కఠినుడు (నల్లసరుపు బండకైనా ఆయింత
చెమట పడ్తది. వాడి గుండెకు చెమ్మకూడా రాదు. సచ్చే పాషాణుడు)
తుడ్డుగాడు = ఉపయోగం లేనోడు, చెత్తవెధవ (పొద్దస్తమానం గానితోనే తిరుగుతున్నవ్. నిన్ను కూడా ఆ తుడ్డుగానితో పోల్చుతరు. జర వాడి సోపతికి పోకు బిడ్డా)