హైదరాబాద్, మే 27: గత కొంతకాలంగా మీరు పరిశీలించినట్లయితే లైక్ కౌంట్స్‌ను దాయటం గురించి మేము పరీక్షలు చేస్తున్నట్లుగా మీరు గమనించే ఉంటారు. నేడు, మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌పై ప్రతి ఒక్కరికీ తమ పబ్లిక్ లైక్ కౌంట్స్‌ను కనబడకుండా దాచుకునే అవకాశం అందిస్తున్నట్లు వెల్లడిస్తున్నాం. తద్వారా తమకు ఏదైతే ఉపయోగముంటుందని ఆశిస్తున్నారో వారు నిర్ణయించుకోవచ్చు.
మేము లైక్ కౌంట్స్‌ను పరీక్షించడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రజల అనుభవాల పరంగా ఏమైనా ఒత్తిడి కలుగుతుందా అని పరీక్షించామని ఇన్స్టాగ్రామ్ ,ఫేస్బుక్ లు తెలిపాయి. ప్రజలతో పాటుగా నిపుణుల నుంచి మేము విన్నదాని ప్రకారం లైక్ కౌంట్స్ కొంతమందికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు, కొంతమందికి ఇది బాధను మిగులుస్తుంది, ఎందుకంటే, కొంతమంది ప్రజలు లైక్ కౌంట్స్‌ను ఏది ట్రెండింగ్‌లో ఉంది లేదంటే ప్రాచుర్యంలో ఉందనే అంశాల కోసం వినియోగిస్తున్నారు. అందువల్ల మేము వారికి ఓ అవకాశం అందిస్తున్నామని ఇన్స్టాగ్రామ్ ,ఫేస్బుక్ లు పేర్కొన్నాయి.
ప్రజలకు తమ అనుభవాలను మరింతగా నియంత్రించుకునేందుకు మరిన్ని మార్గాలను అందించేందుకు తగిన అవకాశాలను చూస్తున్నాం. ఈ కారణం చేతనే మేము నూతన టూల్స్‌ను ప్రకటించాం. ఇవి ప్రజలు తమ డీఎంల నుంచి ప్రమాదకరమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఫేస్బుక్ న్యూస్ ఫీడ్‌పై తాము ఏది చూస్తున్నాం ,పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణను సైతం అందిస్తుంది. అంటే ఫీడ్ ఫిల్టర్ బార్ ; ఫేవరేట్స్ ఫీడ్ , చూజ్ హూ కెన్ కామెంట్ లా ఫిల్టర్ చేసుకోవచ్చు
పబ్లిక్ లైక్ కౌంట్స్ దాచడానికి కొత్త అవకాశాలు
మేము మీకు లైక్ కౌంట్స్‌ను దాచుకునే అవకాశాన్ని మీ ఫీడ్‌కు సంబంధించి అన్ని పోస్ట్‌లపై అందిస్తున్నాం. అలాగే మీకు మీ సొంత పోస్ట్‌లపై సైతం లైక్ కౌంట్స్‌ను దాచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇతరులు మీ పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయని తెలుసుకోలేరు. ఈ విధంగా, మీరు చేసిన పోస్ట్స్‌కు ఎన్ని లైక్‌లు వచ్చాయన్న అంశం పై దృష్టి సారించకుండా, మీకు నచ్చితే, మీరు షేర్ చేసే ఫోటోలు, వీడియోలపై దృష్టి సారించవచ్చు. మీరు సెట్టింగ్స్‌పై న్యూ పోస్ట్స్ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఇతరుల పోస్ట్‌లపై లైక్ కౌంట్స్‌ను సైతం మీరు దాయవచ్చు. ఇది మీ ఫీడ్‌లో అన్ని పోస్ట్‌లకూ వర్తిస్తుంది.