బెంగుళూరు: రొచె హోల్డింగ్ ఏజీ సంస్థకు చెందిన కోవిడ్ ఔషధ జనరిక్ వర్షన్‌ను తయారీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా సంస్థకు అత్యవసర అనుమతి దక్కింది. రొచె సంస్థకు చెందిన టొసిలిజుమాబ్ ఔషధాన్ని ఇక ఇండియాలో హెటిరో సంస్థ తయారీ చేయనున్నది. ఈ నెల చివర వరకు మన దేశంలో ఈ ఔషధం అందుబాటులోకి రానున్నది. టొసిరా బ్రాండ్ నేమ్‌తో దీన్ని అమ్మనున్నారు. డెల్టా వేరియంట్ దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా టొసిలిజుమాబ్ ఔషధాల కొరత ఏర్పడింది. ఆర్థ్రటిస్ డ్రగ్ అయిన టొసిలిజుమాబ్.. కోవిడ్ రోగుల్లో మరణాలను తగ్గించింది. ఈ ఔషధం తీసుకున్న వారిలో వెంటిలేటర్ అవసరం లేకుండా చేసింది. హైదరాబాద్‌లో ఉన్న హెటిరో యూనిట్లో టొసిరా ఔషధాన్ని తయారు చేయనున్నారు. రెమ్డిసివిర్, ఫావిపిరావిర్ డ్రగ్స్‌ను కూడా హెటిరో తయారు చేస్తోంది.