న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 41,76,56,752 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2.88 కోట్ల మోతాదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు 43,25,17,330 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు వివరించింది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 187వ రోజుకు చేరగా.. ఒకే రోజు 20,83,892 వ్యాక్సిన్ మోతాదులను అందించారు. ఇందులో 10,04,581 మొదటి మొతాదులు కాగా.. 95,964 మందికి రెండో డోసు వేశారు. 18-44 ఏజ్ గ్రూప్లో 13,04,46,413 మంది వారి మొదటి.. మరో 53,17,567 మందికి రెండో మోతాదు అందజేసినట్లు వివరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 18-44 ఏజ్ గ్రూప్లో కోటికిపైగా మోతాదులు వేశాయని చెప్పింది.