e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి హ‌త్య‌.. మైనార్టీల ఆందోళ‌న‌

పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి హ‌త్య‌.. మైనార్టీల ఆందోళ‌న‌

పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి హ‌త్య‌.. మైనార్టీల ఆందోళ‌న‌

క‌రాచీ : పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి అశోక్ కుమార్ గ‌త నెల 31 న దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. ఐఎస్ఐ సంస్థ కోసం ప‌నిచేస్తున్న ఒక వ్య‌క్తి కాల్పులు జ‌రిపి హ‌త్య చేసిన‌ట్లుగా తెలుస్తున్న‌ది. వ్యాపార‌వేత్త హ‌త్య‌కు నిర‌స‌న‌గా మైనార్టీలు పెద్ద ఎత్తున ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. దాంతో ఖుజ్దార్-కరాచీ మధ్య పెద్ద ఎత్తున‌ ట్రాఫిక్ నిలిచిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోటారు సైకిళ్లపై వ‌చ్చిన‌ గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు వాద్ బజార్‌లోని అశోక్ కుమార్ అనే వ్యాపారిపై తన దుకాణంలో కూర్చుని ఉన్న స‌మ‌యంలో కాల్పులు జరిపారు. దాంతో అశోక్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మీపంలోని ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌గా అక్క‌డ చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. హిందూ వ్యాపారిని చంపిన స‌మాచారం తెలియ‌గానే వాద్ బ‌జార్‌లోని వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి జాతీయ రహదారిపై బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. దాంతో ఖుజ్దార్-కరాచీ మధ్య పెద్ద ఎత్తున‌ ట్రాఫిక్ నిలిచిపోయింది.

పాకిస్తాన్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన మైనారిటీలపై దారుణానికి సంబంధించిన అంశంపై భారత ప్రపంచ ఫోరం సెక్రటరీ జనరల్ పునీత్ సింగ్ చందోక్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తున్న సిక్కు మత సమాజానికి లేదా భారతదేశానికి చెందిన హిందూ మతం వారికి ఎటువంటి అపాయం జ‌రుగకుండా ఉండటానికి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఓమ‌న్ గ‌ల్ఫ్‌లో మునిగిపోయిన ఇరాన్ యుద్ధ నౌక‌

అమ్మాయిల‌కు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు

అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం

ఆఫ్ఘన్ నుంచి 44 శాతం యూఎస్ బలగాల ఉపసంహర‌ణ‌

శ్రీ‌లంక తీరంలో మునిగిన ఇంధ‌నం కార్గో షిప్‌

జ‌మ్ములో మ‌ళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!

అంగార‌కుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవ‌ర్ ఫొటోలు

వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..

క‌రోనా వేళ అన్నదాత‌లుగా మారిన‌ యాసిడ్ బాధితులు..

కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వ‌రులు.. ఎందుకిలా..?

తెలంగాణ ప్ర‌జ‌ల చిరకాల కోరిక నెర‌వేరింది.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాకిస్తాన్‌లో హిందూ వ్యాపారి హ‌త్య‌.. మైనార్టీల ఆందోళ‌న‌

ట్రెండింగ్‌

Advertisement