ముంబై ,జూన్ 6: భారత భారతవిదేశీ నిల్వలు రికార్డ్ స్థాయిని దాటాయి. మే 28వ తేదీతో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కోట్లకు సమానం. ఫారెక్స్ నిల్వల్లో యూరో, యెన్, ఫౌడ్ వంటి డాలరేతర కరెన్సీల మారకం రేటు పెరగడం ఇందుకు కలిసి వచ్చింది.ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పిన 60వేల కోట్ల డాలర్ల కంటే ఈ నిల్వలు కాస్త తక్కువ. మే 21వ తేదీతో ముగిసిన వారాంతానికి ఫారెక్స్ నిల్వలు 527 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో రష్యా ఇటీవలే అయిదో స్థానానికి పడిపోయింది.