న్యూఢిల్లీ: కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ కోసం అమెరికా నేతృత్వంలోని వ్యూహాత్మక కూటమి ‘పాక్స్ సిలికా’లో భారత్ శుక్రవారం సభ్య దేశంగా చేరింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత్ కూటమిలో చేరే ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో కోర్ తదితరులు పాల్గొన్నారు. పాక్స్ సిలికా అనేది సామర్థ్యాల కూటమిగా కోర్ అభివర్ణించారు. పాక్స్ సిలికా దేశాలదే భవిష్యత్తు అవుతుందని జాకబ్ హెల్బర్గ్ అన్నారు.