e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News సౌదీ ‘చమురు’ డీల్‌కిక కత్తిరింపులేనా?!

సౌదీ ‘చమురు’ డీల్‌కిక కత్తిరింపులేనా?!

సౌదీ ‘చమురు’ డీల్‌కిక కత్తిరింపులేనా?!

న్యూఢిల్లీ: ధ‌ర‌ను నియంత్రించ‌డానికి చ‌మురు ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌న్న విష‌య‌మై సౌదీ అరేబియాతో విబేధాల నేప‌థ్యంతో ఆ దేశంతో చ‌మురు కొనుగోలు ఒప్పందాల‌ను స‌మీక్షించాల‌ని కేంద్ర ముడి చ‌మురు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. మిడిల్ ఈస్ట్ దేశం నుంచి ముడి చ‌మురు కొనుగోలు చేయ‌డానికి మ‌రిన్ని సానుకూల ప‌రిస్థితుల కోసం చ‌ర్చ‌లు జ‌రుపాల‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముడి చ‌మురు ధ‌ర‌తోపాటు కాంట్రాక్ట్ నిబంధ‌న‌ల‌ను డిక్టేట్ చేస్తున్న సౌదీతో లావాదేవీల‌ను తెంచుకోవాల‌ని హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్‌, భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ త‌దిత‌ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కేంద్రం కోరిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇత‌ర దేశాల‌తో ఉమ్మ‌డి చ‌ర్చ‌ల‌కు కేంద్రం పిలుపు

మిడిల్ ఈస్ట్ రీజియ‌న్ ఆవ‌ల నుంచి మెరుగైన ధ‌ర‌కు ముడి చ‌మురు దిగుమ‌తి చేసుకోవ‌డానికి కేంద్ర చ‌మురు సంస్థ‌లు ఉమ్మ‌డిగా చ‌ర్చ‌ల‌ను జ‌రుపాల‌ని కేంద్రం సూచించిన‌ట్లు స‌మాచారం. దేశీయంగా ఇంధ‌న అవ‌స‌రాల కోసం 85 శాతం దిగుమ‌తిపైనే ఆధార‌ప‌డి ఉంటున్నాం.

ఫ‌లితంగా అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు తోడు ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా షాక్ ఇస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి నుంచి ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం మొద‌లైంది. అప్పుడే ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌ని భార‌త్ చేసిన విజ్ఞ‌ప్తిని సౌదీ అరేబియా భేఖాత‌ర్ చేసింది.

భార‌త్‌కు ఇలా సౌదీ రిప్ల‌యి..

‌క‌రోనా ఉధ్రుతంగా సాగుతున్న స‌మ‌యంలో చౌక ధ‌ర‌కు 2020లో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న ముడి చ‌మురును ఆ ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తేవాల‌ని భార‌త్‌కు సౌదీ ఘాటుగా రిప్ల‌యి ఇచ్చింది.

2020లోనే 2సార్లు దిగుమ‌తి సుంకాల పెంపు

కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్‌.. 2020 నుంచి క‌రోనా వ‌ల్ల దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్ట‌డానికి చర్య‌‌లు తీసుకుంది. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడ‌ల్లా ముడి చ‌మురు దిగుమ‌తిపై సుంకాల‌ను రెండు ద‌ఫాలు పెంచింది. త‌ద్వారా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు య‌ధాత‌థంగా కొన‌సాగించేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ప్ర‌స్తుతం పెట్రోల్‌/‌డీజిల్ ధ‌ర‌లో దాదాపు 40 శాతం పైనా ప‌న్నుల భారం కావ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నంగా ఉంది.

చ‌మురు ఉత్ప‌త్తి పెంపున‌కు ఒపెక్ ప్ల‌స్ నిర్ణ‌యం

త‌ర్వాత క‌రోనా ఉధ్రుతి క్ర‌మంగా త‌గ్గుతున్నా కొద్దీ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. త‌ద‌నుగుణంగా ముడి చ‌మురు వినియోగం పెరుగుతున్న‌ది. దీంతో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సౌదీ ఆధ్వ‌ర్యంలోని ఒపెక్ ప్ల‌స్ దేశాల కూట‌మి ముడి చ‌మురు ఉత్ప‌త్తిని పెంచాల‌ని ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకున్న‌ది.

చ‌మురు బేస్ మ‌ళ్లించాల‌ని పీఎస్‌యూల‌కు కేంద్రం

ధ‌ర త‌గ్గించాల‌న్న త‌మ విజ్ఞ‌ప్తిని సౌదీ నిరాక‌రించ‌డంతో ఇప్పుడు ముడి చ‌మురు స‌ర‌ఫ‌రా బేస్‌ను దారి మ‌ళ్లించాల‌ని ముడి చ‌మురు సంస్థ‌ల‌పై కేంద్రం ఒత్తిడి తెస్తున్న‌ది. సంప్ర‌దాయంగా సౌదీ అరేబియా, ఇత‌ర ఒపెక్ దేశాల నుంచే మ‌న‌కు ముడి స‌రుకు ప్ర‌ధానంగా స‌ర‌ఫ‌రా అవుతున్న‌ది.

ధ‌ర పెంపున‌కు ఉత్పత్తి త‌గ్గించిన ఒపెక్

ఒపెక్ ప్ల‌స్ దేశాలు అమ‌లు చేస్తున్న నిబంధ‌న‌లు మ‌న‌పై భారాన్ని మోపుతున్నాయ‌ని ఓ అధికారి తెలిపారు. ఇదే సౌదీ సార‌థ్యంలోని ఒపెక్ దేశాల కూట‌మి.. ధ‌ర‌ల‌ను అదుపు చేయ‌డానికి గ‌తంలో ముడి చ‌మురు ఉత్ప‌త్తి త‌గ్గించిన సంగ‌తిని కేంద్రం గుర్తు చేసింది. ఈ ప‌రిస్థితుల్లో వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా సౌదీ అరేబియాతో పొత్తేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బంగారం ధ‌ర రూ.40 వేల దిగువ‌కు.. ఎందుకంటే?!

బ్లడ్‌ క్యాన్సర్‌.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?

దీదీ.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారా?

ఒప్పో F19 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు

బ్లడ్‌ క్యాన్సర్‌.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్య‌వ‌సాయం

ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలయ్యే టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సౌదీ ‘చమురు’ డీల్‌కిక కత్తిరింపులేనా?!

ట్రెండింగ్‌

Advertisement