e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News మనదే పైచేయి

మనదే పైచేయి

  • తిప్పేసిన అక్షర్‌, అశ్విన్‌ -ఇంగ్లండ్‌ 205 ఆలౌట్‌ -భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 24/1

వారం రోజులుగా సాగుతున్న చర్చకు తెరపడింది. మొతెరా వికెట్‌ స్పిన్‌కే కాదు.. బ్యాటింగ్‌కూ సహకరిస్తుందని రుజువైంది. కాసేపు క్రీజులో నిలబడితే పరుగులు రాబట్టడం బ్రహ్మవిద్యేం కాదని బెన్‌ స్టోక్స్‌ చూపిస్తే.. స్పిన్నర్లే కాదు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తే పేసర్లూ ప్రమాదకరమే అని హైదరాబాదీ సిరాజ్‌ చేతల్లో పించాడు. స్పిన్‌ను ఎదుర్కోవడంలో తమ అసమర్థతను కొనసాగించడంతో ఇంగ్లండ్‌ మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. ఆ తర్వాత టీమ్‌ఇండియా కూడా తడబడింది.  అండర్సన్‌ ధాటికి  శుభ్‌మన్‌ గిల్‌ ఖాతా తెరువకుండానే పెవిలియన్‌ బాటపట్టాడు. మరి మనవాళ్లు ఓపికతో నిలబడి భారీ స్కోరు చేస్తారా.. లేక ఇంగ్లండ్‌ బాటలోనే  నడుస్తారా చూడాలి!

అహ్మదాబాద్‌: బ్యాట్‌కు బంతికి మధ్య జరిగే సమరంలో ప్రతిభదే పైచేయి అని మరోసారి నిరూపితమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆట కంటే ఎక్కువ పిచ్‌ గురించి చర్చ జరుగగా.. అలాంటి అనుమానాల మధ్యే గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో వికెట్‌ నుంచి ఇరు విభాగాలకు సమాన సహకారం లభించింది. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌ సులువుగా పరుగులు రాబట్టగా.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడిన బౌలర్‌కు వికెట్లు దక్కాయి. అయితే ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ తొందరపాటు వల్ల తొలి రోజు ఆటలో భారత్‌దే పైచేయి అయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 205 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌ (55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం నమోదు చేయగా..  లారెన్స్‌ (46; 8 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ (4/68), అశ్విన్‌ (3/47) స్పిన్‌ మాయ కొనసాగించగా.. సిరాజ్‌ (2/45) కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా గురువారం ఆట ముగిసే సమయానికి గిల్‌ (0) వికెట్‌ కోల్పోయి 24 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న కోహ్లీసేన.. ఇంగ్లండ్‌ స్కోరుకు 181 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ (8), చతేశ్వర్‌ పుజారా (15) క్రీజులో ఉన్నారు. 

- Advertisement -

సిరాజ్‌ సూపర్‌ 

స్వదేశంలో రెండో టెస్టు ఆడుతున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. సాధారణంగా బంతి పాతబడ్డాక రివర్స్‌ స్వింగ్‌ రాబట్టే సిరాజ్‌.. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితో తన స్పీడ్‌ పవర్‌ చాటాడు. 130 కిలోమీటర్ల వేగంతో వరుసగా ఔట్‌స్వింగర్లు వేసిన సిరాజ్‌.. ఉన్నఫళంగా 142 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఇన్‌స్వింగర్‌కు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ వద్ద సమాధానమే లేకపోయింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన రూట్‌ను తన బుట్టలో వేసుకున్న సిరాజ్‌.. కాసేపటికి బెయిర్‌స్టోను కూడా ఇదే రీతిలో ఔట్‌ చేయడం విశేషం.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 9, సిబ్లే (బి) అక్షర్‌ 2, బెయిర్‌స్టో (ఎల్బీ) సిరాజ్‌ 28, రూట్‌ (ఎల్బీ) సిరాజ్‌ 5, స్టోక్స్‌ (ఎల్బీ) సుందర్‌ 55, పోప్‌ (సి) గిల్‌ (బి) అశ్విన్‌ 29, లారెన్స్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 46, ఫోక్స్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 1, బెస్‌ (ఎల్బీ) అక్షర్‌ 3, లీచ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 7, అండర్సన్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 205. వికెట్ల పతనం: 1-10, 2-15, 3-30, 4-78, 5-121, 6-166, 7-170, 8-188, 9-189, 10-205, బౌలింగ్‌: ఇషాంత్‌ 9-2-23-0, సిరాజ్‌ 14-2-45-2 అక్షర్‌ 26-7-68-4, అశ్విన్‌ 19.5-4-47-3, సుందర్‌ 7-1-14-1. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) అండర్సన్‌ 0, రోహిత్‌ (నాటౌట్‌) 8, పుజారా (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం:  24/1. వికెట్ల పతనం: 1-0, బౌలింగ్‌: అండర్సన్‌ 5-5-0-1, స్టోక్స్‌ 2-1-4-0, లీచ్‌ 4-0-16-0, బెస్‌ 1-0-4-0.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement