IND vs NZ : భారత్ కీలక వికెట్ కోల్పోయింది. విధ్యంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (24) ఔట్ అయ్యాడు. టిక్నర్ ఓవర్లో సిక్స్ బాదిన సూర్య తర్వాతి బంతికి భారీ షాట్ ఆడాడు. బ్రాస్‌వెల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడంతో సూర్య ఔట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్.. 131/3. అంతకుముందు ఓవర్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టాడు. 35 బంతుల్లో 7 ఫోర్లతో అర్థ శతకం బాదాడు. శాంటర్న్ వేసిన 11 ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
ఇషాన్ రెండో ఓవర్లోనే ఔటైనా కూడా ఒత్తిడికి గురికాలేదు. రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి 87 రన్స్ జోడించాడు. రాహుల్, గిల్ జోడీ 42 బంతుల్లోనే 80 పరుగులు జోడించింది. టిక్నర్ ఓవర్లో గిల్ ఏకంగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో, ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.