నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ (5), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) ఇద్దరూ ఒకే ఓవర్లో అవుటవడంతో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ (2) కూడా నిరాశ పరిచాడు. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్.. లైన్ మిస్ అయ్యాడు. దాంతో బ్యాటును తప్పించుకున్న బంతి మిడిల్ స్టంప్‌ను కూల్చింది. 31 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది.