ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కామెరూన్ గ్రీన్ (37 నాటౌట్), ఆరోన్ ఫించ్ (7) మంచి ఆరంభమే ఇచ్చారు. ఒక పక్క గ్రీన్ ఎడాపెడా బౌండరీలు బాదుతుండగా.. ఫించ్ అతనికి మంచి సహకారం అందించాడు.
అయితే అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో భారీ గేరు మార్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఆరోన్ ఫించ్ పెవిలియన్ చేరాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఫించ్ దాన్ని గాల్లోకి లేపాడు. దీంతో మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా సులభమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాతి మూడు బంతులకు గ్రీన్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 56 పరుగులతో నిలిచింది.