ముంబై : సీటు విషయంలో మహిళల మధ్య వివాదం ముదరడంతో బాహాబాహీకి దిగిన ఘటన ముంబై లోకల్ ట్రైన్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థానే-పన్వెల్ లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్మెంట్లో మహిళలు పరస్పరం జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు కనిపించాయి.
Fight between two female passengers over a seat in #Local #TRAIN .
The woman police constable who went to the rescue got hurt.
Both women filed a case against each other at Vashi Railway Police Station.@Central_Railway #Mumbai pic.twitter.com/nFOKv7bOWv
— Siraj Noorani (@sirajnoorani) October 6, 2022
ఘర్షణ పడుతున్న మహిళలను వారించేందుకు శారద ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్ ప్రయత్నిస్తుండటం కనిపించింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సీటు విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణలో మహిళా సిబ్బందికి గాయాలయ్యాయని వషి రైల్వే స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ కటారె వెల్లడించారు.