న్యూఢిల్లీ : ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై వాహనాలు, పాదచారులు వెళుతున్నా అవేమీ పట్టించుకోకుండా మగువలు ఒకరిపై ఒకరు కలబడుతూ కొట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి.
Fists of fury 🤣 pic.twitter.com/4hREYWowF7
— Vicious Videos (@ViciousVideos) September 29, 2022
టాప్స్, షార్ట్స్ ధరించిన ఇద్దరు మహిళలు పిడిగుద్దులతో రెచ్చిపోయారు. ఓ మహిళ మరొక మహిళను జుట్టుపట్టుకుని లాగుతుండగా కౌంటర్‌గా ఆమె ప్రత్యర్ధిని కడుపులో కొట్టడం కనిపించింది. విషియస్ వీడియోస్ అనే యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 16వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ పోస్ట్‌కు ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యురి అనే క్యాప్షన్ ఇచ్చారు. 24 సెకండ్ల నిడివి కల ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్, రియాక్షన్స్ వచ్చాయి. గతంలో ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళ సిగపట్లకు సంబంధించిన వీడియో సైతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.