న్యూఢిల్లీ : గర్ల్ ఫ్రెండ్ కోసం అబ్బాయిలు గొడవ పడటం చూస్తుంటాం..అయితే ఏకంగా కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో క్లాస్‌రూంలోనే ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘర్ కే కలెష్ అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.
Kalesh Over Girls In Allen Institute pic.twitter.com/WTtfTW7B71
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 11, 2022
ఈ షార్ట్ క్లిప్‌లో ఇద్దరు బాలురు ఓ అమ్మాయి కోసం కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో బాహాబాహీకి దిగడం కనిపించింది. క్లాస్మేట్స్ చుట్టూ చేరి ఎంకరేజ్ చేస్తుండగా బాలురు ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. చివరికి టీచర్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవకు తెరపడింది.
ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్ సెక్షన్లో రియాక్షన్స్‌తో హోరెత్తించారు. ఏ కారణం లేకుండానే నేను, నా సోదరుడు ఇలా చేశామని ఓ యూజర్ రాయగా, నీట్..జేఈఈ కాకుండా విద్యార్ధులను ఇలాంటి వాటికి కూడా సిద్ధం చేస్తున్నారా అని మరో యూజర్ రాసుకొచ్చారు.