న్యూఢిల్లీ : జీవితంలో మనకు కొన్ని విషయాల్లోనే సంతోషం దొరుకుతుంటుంది. మన దేశం కాని వ్యక్తి మన సంస్కృతిని ప్రతిబింబిస్తే వచ్చే సంతోషమే వేరు. ఈ వైరల్ వీడియోలో ఇలాంటి దృశ్యమే పలువురి మనసులను హత్తుకుంటో్ంది. ఈ వీడియోలో దక్షిణ కొరియా మహిళ ఓ కార్యక్రమంలో ఒడిస్సీ ప్రదర్శించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
దక్షిణాఫ్రికా మహిళ బీనా క్యుమ్ ఒడిస్సీని ఈజ్‌తో ప్రదర్శించడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆమె చేసిన నృత్య రీతులు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అదే వేదికపై భారత మహిళ కథక్‌ను ప్రదర్శిస్తూ కొరియన్ మహిళకు జత కలిశారు. రెండు సంస్కృతులు కలిసిన వేళ దానికంటే అందమైనది మరొకటి ఉండదని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ 86,000కుపైగా వ్యూస్ వచ్చాయి. మహిళ ప్రదర్శనపై కామెంట్స్ సెక్షన్లో పలువురు నెటజిన్లు ప్రశంసలు గుప్పించారు. ఓమైగాడ్ లుక్స్ అమేజింగ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా వావ్ బ్యూటిఫుల్, గూస్బంప్స్ వచ్చేశాయని మరో యూజర్ కొరియన్ మహిళ ఒడిస్సీ ప్రదర్శనను మెచ్చుకున్నారు.