న్యూఢిల్లీ : ఆదిపురుష్‌లో రావణాసురుడిగా సైఫ్ ఖాన్ లుక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న నేపధ్యంలో ఓ వ్యక్తి రావణుడి గెటప్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. రావణుడి వేషంలో వ్యక్తి వీధుల్లో ఓ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తుండటం ఈ వీడియోలో కనిపించింది.
गर्ल्स : अरे यार कल मेरा इंटरव्यू है, बहुत फीयर्स लग रहा है 😭
बॉयज ( जलने से पहले) : pic.twitter.com/u9oYP86Dwj
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) October 5, 2022
హర్యాన్వి సాంగ్‌కు ఆ వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా ఫ్యాన్సీ డ్రెస్‌లో మరో వ్యక్తి అతడితో కలిసి చిందేశాడు. రావణుడి వేషంలో ఉన్న వ్యక్తి డ్యాన్స్ మూమెంట్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దసరా రోజున ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్డేట్ చేశారు. ఆదిపురుష్‌లో సైఫ్ స్ధానంలో రావణుడిగా ఇతడిని తీసుకోండని ఓ యూజర్ కామెంట్ చేయగా ఆదిపురుష్ సినిమాలో ఇతడని కూడా చేర్చుకోవాలని మరో యూజర్ రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.