న్యూఢిల్లీ : ఓ వృద్ధుడు సల్సా డ్యాన్స్‌తో కిల్లర్ మూమెంట్స్ ఇస్తూ నెటిజన్ల మతి పోగొట్టాడు. ఓ భామతో సల్సా డ్యాన్స్‌తో జల్సా చేసిన వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్మెంట్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ షార్ట్ క్లిప్‌లో మహిళతో వృద్ధుడు సల్సా పెర్ఫామ్ చేస్తూ కనిపించారు.
హుషారైన పాటకు ఈజ్‌తో కూడిన స్టెప్స్ వేస్తూ ఆయన అలరించిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. మహిళ డ్యాన్స్ మూమెంట్స్‌కు అనుగుణంగా వేగంగా, లయబద్ధంగా ఆయన డ్యాన్స్ ఉర్రూతలూగించింది.
డ్యాన్సింగ్ ఇంటూ ద వీకెండ్ లైఫ్..వయసు కేవలం అంకె మాత్రమే అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. వృద్ధుడి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ సెక్షన్లో ప్రశంసలతో హోరెత్తించారు.