చెన్నై : రోబోల ఆవిష్కరణతో ఆధునిక జీవితంలో అన్ని రంగాల్లో సేవలు సులభతరమవుతున్నాయి. తమిళనాడులోని వెల్లూరులో ఓ వర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆయుధ పూజ వేడుకలకు రోబోలు సహకరించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ రోబో బెల్ మోగిస్తుండటం కనిపించింది.
మరో రోబో ఆయుధ పూజ చేయడంలో సహకరిస్తూ హారతి ఇస్తుండటం కనిపించింది. ఈ వీడియో పలు సోషల్ మీడియా వేదికలపై షేర్ అవుతోంది. ఫనక్ ఎం-6ఐబి, ఆర్జే3ఐసీ అనే రెండు రోబోలను వెల్లూరులోని ఓ వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్ధుల బోధనకు ఉపయోగిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఈ రోబోలు సిబ్బందికి సహకరించాయి. పూజ సందర్భంగా బ్యాక్గ్రౌండ్లో డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రార్ధనలు చేస్తూ కనిపించారు.