భోపాల్ : గత నాలుగేండ్లుగా మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తిని (35) మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విదేశాల్లో నివసిస్తూ కుటుంబ సభ్యులను కలిసేందుకు ఏడాదికి ఒకటి రెండు సార్లు వస్తుంటాడు. బాలిక శనివారం నొప్పితో బాధపడుతుండగా తల్లి అడగటంతో జరిగిన విషయం వెల్లడించింది.
బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. గత నాలుగేండ్లుగా కూతురిని బెదిరించి నిందితుడు అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని ఖర్జానా పోలీసులు వెల్లడించారు.