చెన్నై : మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో ఆ తాత (63) వక్రబుద్ధితో దారుణానికి ఒడిగట్టాడు. పొరుగున ఉండే పదవ తరగతి చదివే బాలిక (15) ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడి ఆగడాలతో బాలిక గర్భం దాల్చడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఇటీవల కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె రెండునెలల గర్భవతని తేల్చడంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయడంతో జరిగిన విషయం తెలిపింది. వైద్యులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. వృద్ధుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.