వెంగళరావుగనర్, జనవరి 25: మగువల మనసుదోచే అందాల వస్త్ర ప్రదర్శన మహిళలను అమితంగా ఆకట్టుకుంటుంది. శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయినిగమాగమంలో హ్యాండ్లూమ్ ఇండియా- 2022 పేరిట ఏర్పాటు చేసిన వస్త్రప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోంది. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేతకారులు, చేతి పని బృందాలు వివిధ రకాల ఉత్పత్తులు 90 స్టాల్స్‌లో ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు జయేశ్ గుప్తా పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.