e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News శిల్పకళకు స్వర్ణయుగం

శిల్పకళకు స్వర్ణయుగం

మాజీ ప్రధాని పీవీ 1966లో ‘ఇల్‌స్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’ అనే సంచికలో ‘ఏ సింఫనీ స్టోరీ ఇన్‌ స్టోన్‌’ అనే వ్యాసం రాసి, ఆలయ విశిష్టతను చాటిచెప్పారు. ఆలయంలోని నర్తకి శిల్పం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్నిచూసి కవి డాక్టర్‌ సినారె ‘భాగినివో, భోగినివో నాట్యకళా విలాసినివో’, ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ అన్న పాటలను రచించారు.

కాకతీయ శిల్పకళా వైభవాన్ని రామప్ప దేవాలయం ప్రపంచానికి చాటిచెప్పింది. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం తెలంగాణకు గర్వకారణం. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, అత్యద్భుత శిల్పకళా నైపుణ్యంతో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే విశిష్టమైనది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన వారసత్వ కట్టడాలు, సహజ వింతలు రెండూ కలిసిన ప్రాంతాలకు యునెస్కో వారసత్వ హోదాను కల్పిస్తుంది. ఇలా మన దేశంలో 38 నిర్మాణాలకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చింది. ఇందులో ఒకటి చరిత్ర, సహజ వింత కలగలిసిన ప్రాంతం కాగా 7 సహజ వింతలు, 30 వారసత్వ కట్టడాలు. ఇప్పుడు 39వ వారసత్వ సంపదగా రామప్ప యునెస్కో గుర్తింపు పొందడం విశేషం.

యునెస్కో గుర్తింపు రావడంలో దాదాపు దశాబ్ద కాలంపైగా ఎంతోమంది ప్రయాస, ఎన్నో ఏండ్ల శ్రమ దాగి ఉంది. అందరి కృషి ఫలితంగా మన కాకతీయ శిల్పకళా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. యునెస్కో గుర్తింపు కోసం తొలినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దే శంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరిం చారు. దీనివల్లే పలుదేశాల ఆమోదం పొంద టం సాధ్యమైంది. మరోవైపు రామప్ప చుట్టుప క్కల ఉన్న చెరువు, కొండలు, అటవీ భూము లను కాపాడటానికి రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పాలంపేట ప్రత్యేక అభివృద్ధి అథారిటీ (పీఎన్‌డీఏ)ని కేసీఆర్‌ ఏర్పాటు చేయించారు.

వారసత్వ హోదా రావడానికి ప్రపంచంలోని మిగతా కట్టడాల కన్నా భిన్నంగా ఉండాలి. దీన్ని ‘ఔట్‌ స్టాండింగ్‌ యూనివర్సల్‌ వాల్యూ’గా వ్యవహరిస్తారు. రామప్ప ఆలయాన్ని యునెస్కోకు నామినేట్‌ చేయడానికి సమర్పించే డోసియర్‌ (పుస్తకం) కోసం కేంద్ర పురావస్తుశాఖ రూ.25 లక్షలు వెచ్చించింది. ఈ డోసియర్‌లో ఆలయ ప్రత్యేకతలను సమర్థవంతంగా పొందుపరిచింది. 2020లో వారసత్వ గుర్తింపు కోసం ప్రపంచవ్యాప్తంగా 21 దేశాలు పోటీపడగా అందులో మన రామప్ప దేవాలయం ముందు నిలిచింది.
ఈ ఆలయ కట్టడాన్ని క్రీ.శ.1173లో ప్రారంభించి దాదాపు 40 ఏండ్లకు పూర్తిచేసినట్లుగా శాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో రామలింగేశ్వరున్ని (శివలింగం) ప్రతిష్ఠించారు. సాధారణంగా ఎక్కడైనా ఆలయాలు దేవుడి పేరుతో లేదా కట్టించిన రాజుల పేర్లతో ప్రాచుర్యం పొందుతాయి కానీ, రామప్ప ఆలయం మాత్రం శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి చెందడానికి శిల్పి నైపుణ్యమే కారణం. దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఏకైక ఆలయం రామప్ప.

రామప్ప ఆలయం అనేక ప్రత్యేకతల సమాహారం. కాకతీయుల శిల్పకళలకు, సాంకేతిక పరిజ్ఞానానికి ఆలవాలం రామప్ప. 800 ఏండ్ల నాటి కట్టడం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఆలయంలోని శిల్పాల కోసం ప్రపంచంలోనే కఠినమైన శిలగా పేరొందిన కృష్ణ శిల (బ్లాక్‌ డోలరైట్‌)ను వాడారు. గర్భాలయంలో దీపాలు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపించేవిధంగా నిర్మించారు. ఆలయంలో స్తం భాలపై రెండు రంగుల రాళ్లతో చెక్కిన శిలలు, సూది బెజ్జం అంత చిన్నచిన్న రంధ్రాలుండే విధంగా స్తంభాలు, నాగకన్యలు, ఆలయానికి కొద్దిదూరంలో జల కళతో ఉట్టిపడే సరస్సు ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నది రామప్ప. కొన్నిచోట్ల ఈజిప్టు, పర్షియన్ల శిల్పాలు కనిపిస్తా యి. దీన్నిబట్టి ఆ కాలంలోనే విదేశీయులతో సం బంధాలున్నట్లు తెలుస్తున్నది. మీటితే స్వరాలు పలికే శిల్పాలు చెక్కిన ఘనత మన కాకతీయ శిల్పుల గొప్పతనం.

సాధారణంగా ఎక్కడైనా ఆలయాలు దేవుడి పేరుతో లేదా కట్టించిన రాజుల పేర్లతో ప్రాచుర్యం పొందుతాయి కానీ, రామప్ప ఆలయం మాత్రం శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి చెందడానికి శిల్పి నైపుణ్యమే కారణం. దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఏకైక ఆలయం రామప్ప.

మాజీ ప్రధాని పీవీ 1966లో ‘ఇల్‌స్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’ పత్రికలో ‘ఏ సింఫనీ ఇన్‌ స్టోన్‌’ అనే వ్యాసం రాసి, ఆలయ విశిష్టతను చాటిచెప్పారు. ఆలయంలోని నర్తకి శిల్పం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్నిచూసి కవి సినారె ‘భాగినివో, భోగినివో నాట్యకళా విలాసినివో’, ‘ఈ నల్ల ని రాలలో ఏ కన్నులు దాగెనో’ అన్న గీతాలను రచించారు.
ఈ గుర్తింపు వల్ల రామప్ప పరిరక్షణ కోసం యునెస్కో ఆర్థిక, సాంకేతిక సహకారం లభించనున్నది. యునెస్కో గుర్తింపు ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణం. ఇప్పుడు రామప్ప ప్రపంచవ్యాప్త పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు 167 దేశాల్లోని 1,126 కట్టడాలు, ప్రాంతాలకు వారసత్వ హోదా లభించింది. రామప్పకు అనతికాలంలోనే ప్రపంచ పర్యాటకుల తాకిడి పెరిగి విదేశీ మారకద్రవ్యం పెరుగుతుంది. స్థానిక, చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకుంటుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసుల ఏండ్లనాటి కల ‘ఓరుగల్లులో విమానాశ్రయం’ సుగమమయ్యే అవకాశం ఉన్నది. మన ఘనచరిత్ర, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ‘రామప్ప’ దేవాలయ పరిరక్షణ మనందరి బాధ్యత.

(వ్యాసకర్త: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి)

మెట్టు శ్రీనివాస్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana