హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): మనుషులు, పశువుల వ్యాక్సిన్ల తయారీలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) తాజాగా ఆక్వాకల్చర్ హెల్త్‌లోకి ప్రవేశించింది. చేపలు, రొయ్యల్లో ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వ్యాక్సిన్లు సహా వివిధ రకాల ఆరోగ్య ఉత్పత్తులను దశలవారీగా తయారు చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆక్వా ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఐఐఎల్ ఎండీ డాక్టర్ కే ఆనంద్‌కుమార్ మాట్లాడు తూ.. ఆక్వా హెల్త్ పరిశ్రమలో యాంటీబయాటిక్స్‌ను తగ్గించేందుకు వ్యాక్సిన్లతోపాటు అవసరమైన ఉత్పత్తులను తయారుచేస్తామని తెలిపారు. సంస్థ డిప్యూటీ ఎండీ ప్రియబ్రత పట్నాయక్ మాట్లాడుతూ.. తమ సంస్థకు శక్తివంతమైన ఆర్అండ్డీ బృందంతో ఆక్వాహెల్త్ మేనేజ్మెంట్ కోసం వ్యాక్సిన్లను తయారుచేసే సాంకేతిక సామర్థ్యం ఉన్నదని చెప్పారు.