ఆర్ఎక్స్ 100 సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది పంజాబీ సోయగం పాయల్ రాజ్‌పుత్ (Paayal Rajput). ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు పాయల్ ఖాతాలో వచ్చి పడ్డాయి. ఆ తర్వాత వెంకటేశ్‌తో వెంకీ మామ, రవితేజతో డిస్కో రాజాలో మెరిసింది. ఈ బ్యూటీ ఆదిసాయికుమార్‌తో కలిసి తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan) సినిమాలో నటించగా.. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ట్విటర్ హ్యాండిల్ (Paayal Twitter handle)లో చిట్‌చాట్ సెషన్లో పాల్గొంది పాయల్. ఒకవేళ మీరు నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు అని ఓ అభిమాని పాయల్‌ను అడిగారు. దీనికి పాయల్ రాజ్‌పుత్ స్పందిస్తూ..తాను జర్నలిజం చేసినట్టే..న్యూస్ యాంకర్ కూడా అయ్యేదానినని రిప్లై ఇచ్చింది. కాగా మరోవైపు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న జిన్నా చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా నటిస్తోంది.
దీంతోపాటు కిరాతక, హెడ్ బుష్ చిత్రాల్లో నటిస్తోంది. ఎలాగైనా బిగ్ బ్రేక్ అందుకోవాలని ఎదురుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్ మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఆమె ఫాలోవర్లు, అభిమానులు.