e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News ఫిన్‌టెక్ సంస్థ‌ల నుంచి ఆర్థిక సేవ‌ల‌కు పెనుముప్పు!

ఫిన్‌టెక్ సంస్థ‌ల నుంచి ఆర్థిక సేవ‌ల‌కు పెనుముప్పు!

ఫిన్‌టెక్ సంస్థ‌ల నుంచి ఆర్థిక సేవ‌ల‌కు పెనుముప్పు!

న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సేవ‌లు, సంస్థ‌ల‌కు ఫిన్‌టెక్ సంస్థ‌ల నుంచి ముప్పు పొంచి ఉంద‌ని బ‌జాజ్ ఫైనాన్స్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సంజీవ్ బ‌జాజ్ పేర్కొన్నారు. దేశీయంగా ఆర్థిక సేవ‌ల‌పై భారీ స్థాయిలో నియంత్ర‌ణ కొన‌సాగుతున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న టైమ్స్ నెట్‌వ‌ర్క్ ఇండియా ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఎక‌న‌మిక్ కాంక్లేవ్‌లో మాట్లాడారు.

ఫిన్‌టెక్ సంస్థ‌ల‌కు టెక్నాల‌జీ అందుబాటులో ఉన్న‌ద‌ని, అందువ‌ల్లే తాము ప్రైవేట్ ఫిన్‌టెక్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడుతున్నామ‌ని సంజీవ్ బ‌జాజ్ చెప్పారు. అయితే ఫిన్‌టెక్ సంస్థ‌ల‌కు ఆర్థిక సేవ‌ల డెలివ‌రీపై స‌రైన ప‌రిజ్ఞానం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల (ఎన్బీఎఫ్‌సీ)కు ఆర్థిక సేవ‌ల విష‌య‌మై పూర్తి అవ‌గాహ‌న‌, ప‌రిజ్ఞానం ఉంద‌ని అన్నారు.

దేశంలోని అత్య‌ధిక ఫిన్‌టెక్ కంపెనీలు ప్ర‌స్తుతం త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను పెంచుకోవ‌డానికి ఖ‌ర్చు చేస్తున్నాయ‌ని సంజీవ్ బ‌జాజ్ చెప్పారు. బ‌జాజ్ ఫైనాన్స్ వంటి సంస్థ‌లు ఏటా 60 ల‌క్ష‌ల మంది ఖాతాదారుల‌కు కొత్త‌గా ఆర్థిక సేవ‌లందిస్తున్నాయ‌ని తెలిపారు. టెక్నాల‌జీతో అనుసంధాన‌మైన ప్ర‌యోజ‌నాల‌ను స్టార్ట‌ప్ సంస్థ‌లు నూత‌న మార్గాల్లో ఇత‌ర సంస్థ‌ల‌తో స‌హ‌కారం దిశ‌గా అడుగులు వేస్తున్నాయ‌ని చెప్పారు. భ‌విష్య‌త్‌లో రుణాలు, బీమా, పెట్టుబ‌డుల‌కు ఫిన్‌టెక్ సంస్థ‌ల‌ను న్యూ అవ‌తార్ స్రుష్టిస్తాయ‌న్నారు.

ఇవి కూడా చ‌దవండి:

మా వాద‌నే నిజ‌మైంది.. సుప్రీం తీర్పుపై ర‌త‌న్ టాటా!

ధ‌ర‌లక‌నుగుణంగా ముడి చ‌మురు దిగుమ‌తి పాల‌సీ: ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్

స్క్రాపేజీ పాల‌సీ అమ‌లు క‌ష్ట‌మే.. మారుతి ఈడీ శ్రీవాత్స‌వ‌

రిల‌య‌న్స్‌-ఆరామ్‌కో డీల్ మ‌రింత జాప్యం.. ఎందుకంటే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫిన్‌టెక్ సంస్థ‌ల నుంచి ఆర్థిక సేవ‌ల‌కు పెనుముప్పు!

ట్రెండింగ్‌

Advertisement