ICICI Home Loans | ఆర్బీఐ రెపోరేట్ పెంపుతో ఐసీఐసీఐలో ఇప్పటికే ఇండ్ల రుణాలు తీసుకున్న వారు, కొత్తగా రుణాలు తీసుకునే వారికి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. రెపోరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీఐసీఐ వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. ఐసీఐసీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఐఈబీఎల్ఆర్) 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఐఈబీఎల్ఆర్ 9.25 శాతంగా ఖరారు చేసింది. ఇక ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.
గడువు (టెన్యూర్) — అక్టోబర్ 1 నుంచి ఎంసీఎల్ఆర్ ——— సెప్టెంబర్ 1 నుంచి ఎంసీఎల్ఆర్
ఓవర్‌నైట్ ———– 7.85 శాతం ———————————– 7.75 శాతం
ఒక నెల ————– 7.85 శాతం ———————————– 7.75 శాతం
3 నెలలు ————- 7.90 శాతం ———————————– 7.80 శాతం
6 నెలలు ————- 8.05 శాతం ———————————– 7.95 శాతం
ఏడాది —————- 8.10 శాతం ———————————– 8.00 శాతం
ఐసీఐసీఐ ఇండ్ల రుణాలపై (ఈబీఎల్ఆర్ లేదా ఎంసీఎల్ఆర్) వడ్డీరేటు పెంపుతో ఈఎంఐ భారం పెరుగుతుంది. అయితే బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్‌ను బట్టి ఇది ఖరారవుతుంది. ఉదాహరణకు 2019 అక్టోబర్ ఒకటో తేదీకి ముందు ఇంటి రుణం తీసుకుంటే దానికి ఎంసీఎల్ఆర్ లింక్డ్ వడ్డీరేటు ఖరారవుతుంది. ఎంసీఎల్ఆర్ ఏడాదికోసారి సవరిస్తారు. బ్యాంక్ మార్జిన్ కూడా ఇండ్ల రుణాలపై వడ్డీరేటు (ఎంసీఎల్ఆర్)లో కలిపేస్తారు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (ఐఈఈబీఎల్ఆర్)కు అనుగుణంగా తీసుకున్న రుణాలపై మూడు నెలల కోసారి వడ్డీరేట్ ఖరారవుతుంది. దీని ప్రకారం ఈ నెల ఈఎంఐలోనే భారం పెరుగుతుంది. ఉదాహరణకు 20 ఏండ్ల టెన్యూర్‌తో మీరు రూ.20 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం.. పాత వడ్డీరేటు 8.75 శాతంగా ఉంటే.. ఇప్పుడు 9.25 శాతంగా మారుతుంది.
రుణ మొత్తం ————————- రూ.30 లక్షలు
టెన్యూర్ —————————— 20 ఏండ్లు
ఇంటి రుణంపై పాత వడ్డీ ——— 8.75 శాతం
పాత నెలవాయిదా (ఈఎంఐ) —- రూ.26,511
హోంలోన్‌పై కొత్త వడ్డీ ————- 9.25 శాతం
పాత నెలవాయిదా (ఈఎంఐ) —- రూ.27,476
ఈఎంఐలో పెరుగుదల ———— రూ.965