టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు అరణ్య. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. మార్చి 26న విడుదల కానుండగా..హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ..సినిమా చూసిన తర్వాత, భారత చిత్రపరిశ్రమలో ఇలాంటి సినిమా వస్తున్నందుకు గర్వంగా ఫీలవ్వాలి. నేను సినిమా చూసిన తర్వాత రానాను స్టన్ అయిపోయా. అద్బుతంగా నటించి పాత్రలో జీవించేశాడు.
అది నాకిప్పుడు ఓ ఛాలెంజ్ లాంటిది. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందిస్తున్న ప్రభు సోలోమన్‌కు ధన్యవాదాలు. చిత్రయూనిట్ మెంబర్స్ చాలా బాగా పనిచేశారని అన్నాడు. విష్ణువిశాల్, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియా పిల్‌గావ్ంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.