ఎవరితోనో డేటింగ్లో ఉన్నానంటూ తనపై ఊహాగానాలు, గాసిప్స్ రావడం ఇష్టం లేదని అంటోంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. ఈ బ్యూటీ ఎప్పుడైనా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తే పుకార్లు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా. ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ కు వెళ్లాల్సి వచ్చినా కేర్‌ఫుల్ గా ఉంటున్నా. లింకప్, డేటింగ్ రూమర్స్ అంటే నాకు నచ్చవు. అందుకే ఎప్పుడైనా ఫ్రెండ్‌తో బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు ఎక్కడికెళ్లాలో డిసైడ్ చేయాలని వారికే చెప్తా.
నా లవ్ లైఫ్ చాలా అద్బుతంగా ఉంది. నాన్‌స్టాప్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. నేను పూర్తిగా సింగిల్. మెసేజ్ చేయడానికి, కాల్ చేసేందుకు నాకు ఎవరూ లేరు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరైనా నా జీవితంలోకి వస్తే..సంతోషమే కానీ..నేను రిలేషన్షిప్ కోసం వెయిటింగ్ చేయడం లేదని చెప్పుకొచ్చింది. నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రంలో నటిస్తోంది.