బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో 9వ లక్కీ డ్రా
బేగంపేట్, సెప్టెంబర్ 30 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా బొనాంజా నగర వాసులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. వినియోగదారులు, కొనుగోలుదారులు ఎంతో ఆనందంతో ఈ బొనాంజాలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తొమ్మిదవ రోజు శుక్రవారం సికింద్రాబాద్ బేగంపేట్ వరుణ్ మోటార్స్ షోరూంలో లక్కీ డ్రాను తీశారు. బేగంపేట్ వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్సీ రాజు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజింగ్ విభాగం డీజీఎం విజయ్కులకర్ణితో కలిసి డ్రా తీసి విజేతలను ప్రకటించారు.
నిజాంపేట్ సీఎంఆర్ షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసిన శ్రీనివాసరావు మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్ష్మీ నిస్సాన్‌లో షాపింగ్ చేసిన సయ్యద్ అక్బర్ ద్వితీయ బహుమతి, నిలోఫర్ కేఫ్‌లో టీ తాగిన శివ తృతీయ బహుమతి, కూకట్పల్లి కేఎల్ఎంలో షాషింగ్ చేసిన కవితరాగి నాలుగవ బహుమతి, మానేపల్లి జువెల్లరీస్‌లో షాపింగ్ చేసిన రేణుక ఐదవ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్సీ రాజు, సీజీఎం వెంకటేశ్వర్రావు, జీఎంలు సుజని, నీరజ్, ఏజీఎం రాంకుమార్, మేనేజర్ శ్రీకాంత్, నమస్తే తెలంగాణ నుంచి అడ్వైర్టెజింగ్ విభాగం ఏజీఎం రాజిరెడ్డి, రామకృష్ణ, మేనేజర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ దినపత్రిక ద్వారా బహుమతి అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. నేను నిన్ననే షాపింగ్ చేశారు. బహుమతి వస్తుందని ఊహించలేదు. నేను నా జీవితంలో మొదటి సారిగా బహుమతిని అందుకున్నాను. ఈ అవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ దినపత్రిక వారికి నా కృతజ్ఞతలు.
– మొదటి విజేత శ్రీనివాస్‌రావు, నిజాంపేట్
నమస్తే తెలంగాణ దినపత్రికతో కలిసి గత 9 ఏండ్లుగా కలిసి పని చేస్తున్నాం. ఈ దసరా బొనాంజాతో వరుణ్ మోటార్స్‌కు మంచి ఆదరణ పెరిగింది. మారుతీ సుజికి వాహనాలైన ఆల్టో, సెలిరియో, వేగనార్ వాహనాల బుకింగ్‌లు ఈసారి గణనీయంగా 15 శాతం కొనుగోళ్లు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈవెంట్లలో కూడా బుకింగ్‌లు పెరుగుతున్నాయి. ఈ బొనాంజా మాకు చాలా ప్రోత్సాహంగా ఉన్నది.
– ఆర్సీ రాజు, వరుణ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
కేవలం శుక్రవారం ఒక్క రోజే సుమారు 200 మారుతీ సుజికి కార్లను డెలివరీ చేశాం. ఇది మాకు చాలా గర్వంగా ఉన్నది. లక్కీ డ్రాతో సేల్స్ చాలా వరకు పెరిగాయి. వినియోగదారులు కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. బొనాంజాతో మంచి స్పందన వస్తున్నది. నగర వాసులకు బొనాంజాతో మంచి బహుమతులు వస్తున్నందున కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు.
– జీ.నీరజ్, జనరల్ మేనేజర్ సేల్స్, వరుణ్ మోటార్స్