సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాలలో పురుషులతో పోటీపడుతున్న నారీమణులు డ్రైవింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడు వాళ్లూ వాహనం నడపడం అనివార్యమైంది.కార్యాలయాలకు వెళ్లడం.. పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం.. పండుగలకు ఊరెళ్లడం.. వంటి పనుల్లో మరొకరిపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్ తప్పనిసరిగా మారింది. అందుకే మహిళలు డ్రైవింగ్‌పై అధిక ఆసక్తి ప్రదర్శిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో రోజుకు 200 స్లాట్స్ బుకింగ్ అవకాశం ఉంటే అందులో సుమారు 40 శాతం మంది యువతులు, గృహిణులు ఉంటున్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి
వరకు రాష్ట్రం మొత్తంలో 43,067 మంది మహిళలు లైసెన్స్‌లు పొందితే.. ఇందులో 31 వేలకు పైగా మహిళలు నగరవాసులు కావడం విశేషం.
ఒకప్పుడు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, ఓలా, ఉబర్‌లాంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించేవారు కూడా సొంతంగా కారు, బైకు నడుపుతూ వెళ్లేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కారు నడిపేందుకు గృహిణులు, విద్యార్థినులు, ఉద్యోగస్తులు డ్రైవింగ్ సూళ్లను ఆశ్రయిస్తున్నారు. మరికొంత మంది కుటుంబ సభ్యుల సహకారంతో స్టీరింగ్ పడుతున్నారు. రక్షణ, భద్రత వంటి అంశాల నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు, అమ్మాయిలు బైకు కంటే కారు నడిపేందుకే ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు.
స్టీరింగ్ పట్టు.. గేరు మార్చు..
గ్రేటర్లో సుమారు 400లకుపైగా డ్రైవింగ్ సూళ్లు ఉన్నాయి. వీటితోపాటు మరో 50- 60 వరకు వివిధ కంపెనీల డ్రైవింగ్ సూళ్లు ఉన్నాయి. ఇందులో ఒకో బ్యాచ్‌కు కనీసం 20-35 మంది చొప్పున కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 2019 నుంచి 2022 వరకు దాదాపు 1.11 లక్షల మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ఇందులో అధిక భాగం కారు లైసెన్స్ ఉన్నవాళ్లే కావడం విశేషం. ప్రస్తుతానికి గ్రేటర్లో మొత్తం 4.27 లక్షల పైనే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలు ఉన్నారని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
డ్రైవింగ్ తప్పనిసరి
ఈ రోజుల్లో డ్రైవింగ్ అనివార్యంగా మారింది. నాకు బైకు డ్రైవింగ్ వచ్చినా, కారు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను. మా ఆయన ఆఫీసుకు వెళితే లంచ్ ఇవ్వడం.. సాయంత్రం మార్కెట్‌కు వెళ్లడం లాంటివన్నీ ఇప్పుడు నేనే సొంతంగా చేసుకుంటున్నాను. ఫలితంగా నా టైంటేబుల్ సరైన విధంగా సాగుతోంది. గతంలో మార్కెట్‌కు నడిచి వెళ్లడం.. ఆటో కోసం ఎదురుచూడటంలాంటివి ఉండేవి. దీంతో సమయం సరిపోయేది కాదు. ఇప్పుడు డ్రైవింగ్ వచ్చాక చాలా సమయం
ఆదా అవుతోంది.
సరైన శిక్షణ తీసుకోవాలి
డ్రైవింగ్ నేర్చుకోవడానికి మహిళలు చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అందులోనూ కారు లైసెన్స్ పొందే వారి సంఖ్య అధికంగా ఉంది. నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్న డ్రైవింగ్ స్కూళ్లలోనే శిక్షణ తీసుకోవాలి. రోడ్డు నిబంధనలు అన్నీ క్షుణ్ణంగా గుర్తుంచుకోవాలి. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆలస్యమైనా పర్లేదు కానీ వచ్చిరానీ డ్రైవింగ్‌తో లైసెన్స్ పొందాలని ప్రయత్నిస్తే కుదరదు. ఆర్టీఏ నిర్వహించే అన్ని టెస్ట్‌లు ఉత్తీర్ణత సాధించాలి.