ఎల్బీనగర్ జోన్‌బృందం, ఆగస్టు 12: మహిళలకు సీఎం కేసీఆర్ పెద్దన్న లాంటివారని హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హయత్‌నగర్‌లో టీఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శివగోని అంజలిగౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఫ్లెక్సీకి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ కమిటీ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గంగని నాగేశ్, ఉపాధ్యక్షురాలు రాధిక, రేణుక, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, ఉద్యమ నాయకులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.