e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News ఉల్లిపాయ టీతో ఉప‌యోగాలేంటో తెలుసా

ఉల్లిపాయ టీతో ఉప‌యోగాలేంటో తెలుసా

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయ‌ద‌నేది నానుడి. ఉల్లిలో అన్ని ర‌కాల పోష‌కాలు ఉన్నాయి కాబ‌ట్టే పూర్వ‌కాలం నుంచి మ‌నం వండే ప్ర‌తి కూర‌లోనూ ఉల్లిపాయను వాడుతున్నాం. కూర‌ల‌తో పాటు స‌లాడ్లు, స్నాక్స్‌, శాండ్‌విచ్ లాంటి ఆహార ప‌దార్థాల్లోనూ ఉల్లిపాయ‌ను వాడుతుంటారు. అయితే ఉల్లిపాయ‌తో టీ కూడా చేయొచ్చని తెలుసా‌. ఉల్లితో చేసిన టీ తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయలో విటమిన్ సి, బి విటమిన్లు, పొటాషియం మరియు మరిన్ని పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయ టీ తాగడం ద్వారా చాలా రకాల గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే.. ఉల్లిపాయ అత్యంత శక్తివంతమైన సహజ యాంటీబయాటిక్స్‌గా పరిగణించబడుతుంది. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగించే శక్తి కలిగి ఉంటుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు శ్లేష్మంతో పోరాడటానికి, వాయుమార్గాల నుండి శ్లేష్మం బహిష్కరించడానికి బాగా సహాపడతుతుంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..

  1. రక్తపోటును నియంత్రిస్తుంది
  2. ఎముకలను బలంగా తయారు చేస్తుంది
  3. మధుమేహాన్ని తగ్గిస్తుంది
  4. చిరాకు, ఒత్తిడి లాంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement