కావలసిన పదార్థాలు
తీపి గుమ్మడి ముక్కలు: అరకప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లు: ఐదు కప్పులు, వెన్న: పావుకప్పు, బాదం ముద్ద: ఒక చెంచా, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: పావు టీస్పూన్, నూనె: రెండు టీస్పూన్లు, సోంపు పొడి: రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి (చిన్నది), పుదీనా తరుగు: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె వేడయ్యాక సోంపు పొడి, పుదీనా తరుగు వేయాలి. పుదీనా వేగాక ఉల్లిపాయ, గుమ్మడి ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేయాలి. అన్ని బాగా వేగాక కూరగాయల ముక్కలు ఉడికించిన నీళ్లు పోసి బాగా ఉడికించాలి. నీళ్లు సగం అయ్యాక, దింపి చల్లార్చి ముక్కలతోసహా నీళ్లని మిక్సీ జారులోకి తీసుకొని మెత్తని గుజ్జ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జుకి బాదం ముద్ద, వెన్న కలిపి మళ్లీ ఐదునిమిషాల పాటు స్టవ్ మీదపెట్టి చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూ మరిగించాలి. చిక్కబడ్డ గుమ్మడి సూప్‌ని బౌల్లోకి తీసుకుని పైనుంచి కాస్త వెన్న వేసుకుని సర్వ్ చేసుకోవాలి.