ఫిట్నెస్ ప్రియులంతా ఎప్పుడూ ప్రొటీన్లు, పోషకాలు కలిగిన ఆహారాలు తినడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎందుకంటే.. ప్రోటీన్ కండరాలను రిపేర్ చేయడంలో సహాయపడటమే కాక, అధిక బరువు పెరగకుండా నియంత్రించడంలో దోహదపడుతుంది. గుడ్లు, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటితో సమానమైన ప్రోటీన్లు మొలకల ద్వారా అందుతాయి. అందుకే ఫిట్నెస్ మెయింటైన్ చేసేవారు మొలకలను ఆహారంగా తీసుకుంటుంటారు.. మరి మొలకలను ఉడికించి తినడం మంచిదా? పచ్చిగానే తినాలా? అనేదే చాలామందికి సందేహం.