e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News భయపెడుతున్న నకిలీ వ్యాక్సిన్లు.. నకిలీలను ఇలా గుర్తించండి!

భయపెడుతున్న నకిలీ వ్యాక్సిన్లు.. నకిలీలను ఇలా గుర్తించండి!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మన ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడుతున్నది. ఇప్పటివరకు దాదాపు 32 కోట్ల డోసులు అందజేశారు. అయితే, వ్యాక్సిన్ల కోసం ప్రజలు తిరుగుతూ మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. వారు చెప్పే మాటలను నమ్మి పెద్దమొత్తంలో డబ్బు కోల్పోవడంతో పాటు అనారోగ్యం పాలై దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారి నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట ఇలాంటి నకిలీ వ్యాక్సిన్‌ భాగోతం వెలుగులోకి వస్తుండటం భయపెడుతున్నది.

ముంబై ఖండావలి ప్రాంతంలో ఉన్న హీరనందని హెరిటేజ్‌ సొసైటీలో ఇలాంటి ఓ నకిలీ వ్యాక్సిన్‌ క్యాంప్‌తో దాదాపు 400 మంది ఇబ్బందులకు గురయ్యారు. ఇక్కడ ఒక్కొక్కరి నుంచి రూ.1260 వసూలు చేశారు. అలాగే, కోల్‌కతాలో ఓ వ్యక్తి ఐఏఎస్‌ అధికారినంటూ ఏర్పాటుచేసిన క్యాంప్‌ను ప్రారంభించిన టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి.. అనంతరం అక్కడే డోస్‌ తీసుకుని అనారోగ్యం పాలయ్యారు. ఇలాంటి నకిలీలు మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా పుట్టుకొచ్చారు. అక్కడ వ్యాక్సిన్‌ వేసినట్లుగా తెలిపే కార్డులను పలు ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో నకిలీలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాకు పొరుగునే ఉన్న మెక్సికోలో దాదాపు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

మన దేశంలో వ్యాక్సిన్‌ వేయగానే వెంటనే మనం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపుతున్నారు. అనంతరం కోవిన్‌ యాప్‌గానీ, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో గానీ మన సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని మనకు సమాచారం అందుతుంది. అలా అందడం లేదంటే అది ఖచ్చితంగా నకిలీ రిజిస్ట్రేషన్‌గా గుర్తించి సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలి. దీనికి ముందుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు మాత్రమే వెళ్లి డోసులు తీసుకోవడం మంచిదని ప్రజలంతా గుర్తించాలి.

నమోదు సమయంలో గుర్తుంచుకోవలసినవి

టీకా పొందేందుకు కోవిన్ యాప్ లేదా పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. కోవిన్‌పైనే టీకాలు వేయడానికి అన్ని సౌకర్యాలను భారత ప్రభుత్వం ఇచ్చింది. మరే ఇతర యాప్‌ లేదా వెబ్‌సైట్‌ను వాడకూడదు. లేదా మన సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. కోవిన్ పోర్టల్‌కు లింక్ – https://www.cowin.gov.in/home కోవిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్ – https://play.google.com/store/apps/details?id=com.cowinapp.app
రిజిస్ట్రేషన్ సమయంలో మన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. కోవిన్‌కు సంబంధించిన ఏదైనా ఓటీపీ వస్తే, దాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. పేరు నమోదు తర్వాత స్లాట్‌ బుక్ చేస్తారు. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. టీకా తీసుకునే ముందు ఆరోగ్య కార్యకర్తకు ఈ ఓటీపీ చెప్పవలసి ఉంటుంది. కోవిన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్‌తో నలుగురు వరకు నమోదు చేసుకోవచ్చు. ఎవరికి వారు తమతమ మొబైల్ నంబర్‌తో మాత్రమే పేర్లను నమోదు చేసుకోవడం ఉత్తమం.

వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా తనిఖీ చేయాలి?

టీకా తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్‌ ఇస్తున్నది. ఈ టీకా సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా సర్టిఫికేట్ నిజమైనదా? నకిలీదా? అని తనిఖీ చేసుకోవచ్చు. దీనితోపాటు పేరు, వయస్సు, టీకాలు వేసిన తేదీ, టీకా కేంద్రం పేరు, సర్టిఫికెట్‌లో టీకాలు వేసిన ఆరోగ్య కార్యకర్త పేరు వంటి సమాచారం ఉంటుంది. ఈ సమాచారంలో ఏదైనా పొరపాటు లేదా లోపం ఉంటే వెంటనే అక్కడి అధికారులకు చూపించాల్సి ఉంటుంది.

నకిలీ టీకా వస్తే ఏమవుతుంది?

నకిలీ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, టీకా తర్వాత చేతుల నొప్పి, తేలికపాటి జ్వరం లేదా అలసట వంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా టీకా వేసిన అనంతరం 80 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు వ్యక్తి రోగనిరోధక శక్తి, టీకా రకంపై కూడా ఆధారపడి ఉంటాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

మిడతల దండును అడ్డుకునేందుకు ఇండో-పాక్‌ ఆపరేషన్‌

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. రోగులు క్షేమం

చరిత్రలో ఈరోజు : లంగూర్‌ నుంచి మనిషికి తొలి కాలేయ మార్పిడి

కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరి గడువు పొడగింపు

టోక్యో ఒలింపిక్స్‌ ఆడటం లేదు: సెరెనా విలియమ్స్‌

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana