బీజింగ్, సెప్టెంబర్ 27: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారన్న వార్తలకు తెరపడింది. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు తర్వాత తొలిసారిగా ఆయన బయట కనిపించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఎగ్జిబిషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో ఎస్సీఓ సదస్సుకు వెళ్లి వచ్చాక ఆయనను నిర్బంధించారన్న ఊహాగానాలకు తెరపడింది. జిన్‌పింగ్‌ను గృహనిర్బంధం చేశారని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధిపతి పదవి నుంచి తొలగించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.