దక్షిణ చైనాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా వరదలు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూలిపోయాయి. వరదల్లో ఇళ్లు, కార్లు కొట్టుకుపోతున్నాయి. పంటలన్నీ నీటమునిగాయి. దక్షిణ ప్రావిన్స్ హునాన్లో నదులు, సరస్సుల్లో నీటి మట్టాలు ఇటీవల హెచ్చరిక రేఖ కంటే ఎక్కువగా పెరిగాయి. కాగా, ఈ వరదల ధాటికి రాజభవనంలాంటి ఇల్లు నదిలో కూలిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తీవ్రమైన వరదల కారణంగా యోంగ్జౌ నగరంలో అనేక ఇండ్లు కూలిపోయాయి. స్థానికంగా ఓ ఇల్లు కూలిపోయి నదిలో పడిపోయింది. ఇది కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన వారంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా, ఆ ఇంటినుంచి అందరినీ ముందే ఖాళీ చేయించామని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
Heavy rains & intense flooding hit China’s Hunan Province in recent days, resulting in severe damage to homes in the city of Yongzhou—including one home that collapsed in its entirety on camera.
All residents had been evacuated in advance and no injuries were reported. pic.twitter.com/593Ve2nf9P
— NowThis (@nowthisnews) June 26, 2022