e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...

ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ…

ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...

ముంబై ,జూన్ 16: భారత మార్కెట్లో పలు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒకటి ఎలక్ట్రిక్ 2-వీలర్ తయారీ సంస్థ హాప్ఎలక్ట్రిక్ మొబిలిటీ. హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం 5 ఎలక్ట్రిక్-వెహికల్ సొల్యూషన్స్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. దీనికోసం జైపూర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ఏడాదికి 50,000 వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హాఫ్ లియో ,హాఫ్ లైఫ్ అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. త్వరలో మరో ఈ-మోటర్‌బైక్‌ను విడుదల చేయనున్నది. హాఫ్ ఈ-వెహికల్ సొల్యూషన్స్ విస్తృతమైన ఆర్ అండ్ డి పరిశోధనలపై ఆధారపడి ఉంటాయి. వీటి ధర రూ. 65,500 నుంచి మొదలవుతుంది. ​జైపూర్‌లోని ప్రొడక్షన్ యూనిట్ లో ఉత్పత్తిని 1 లక్ష యూనిట్లకు పెంచవచ్చు. 2022 నాటికి, దక్షిణ భారతదేశంలో కొత్త ఉత్పాదక విభాగాన్ని ఏర్పాటు చేయాలని బ్రాండ్ యోచిస్తోంది, ఇది సంవత్సరానికి కనీసం 5 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...
ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...
ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ...

ట్రెండింగ్‌

Advertisement