పచ్చని పరిసరాలను చాలామంది ఇష్టపడతారు. ఇల్లు, ఆఫీస్.. అన్నిచోట్లా మొక్కలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం వచ్చేసింది.. సరికొత్త గ్లాస్ ప్లాంటర్. స్మోకీ కాక్టెయిల్ సంస్థ రూపొందించిన ఈ గుండ్రని బీకరులాంటి గాజు కుండీలు చెక్క స్టాండ్‌కు జతచేసి ఉంటాయి. చిరుగాలికి అవి అటూ ఇటూ ఊయలలా ఊగుతూ పరిసరాలను ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఒక సెట్లో మూడు కుండీల వరకూ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కుండీ స్టాండ్‌ను కిచెన్, లివింగ్ రూమ్, బాల్కనీ, రీడింగ్ టేబుల్.. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆత్మీయులకు బహుమతిగా ఇచ్చేందుకూ బావుంటాయి.