HDFC Interest Hike | ఇంటి రుణాలపై హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) వడ్డీరేటు పెంచేసింది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచేయడంతో హెచ్డీఎఫ్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇంటి రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 30 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. తాజాగా రుణాలు తీసుకునేవారు, ఇప్పటికే ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి కూడా వర్తిస్తుందని ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
“ ప్రస్తుత ఖాతాదారులు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లను ఖరారు చేయడానికి హెచ్డీఎఫ్సీ మూడు నెలల సైకిల్‌ను అనుసరిస్తుంది. ప్రతి కష్టమర్ తొలి విడుత రుణం తీసుకున్న తేదీ నుంచి మూడు నెలలకు వడ్డీరేట్లకు అనుగుణంగా ఈఎంఐలు మారతాయి” అని తెలిపింది. దీని ప్రకారం హెచ్డీఎఫ్సీ ఇంటి రుణ గ్రహీతల రుణాలపై నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు పెరుగుతాయి. హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లు ఏడు నుంచి 7.45 శాతం మధ్య ఉంటాయి. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి.
శ్లాబ్ —————————— క్యాటగిరీ ——– నూతన వడ్డీరేటు — పాత వడ్డీరేటు
సిబిల్ స్కోర్ 750పైగా ఉంటే ——————— 7 శాతం —— ——- 6.70 శాతం
రూ.30 లక్షల్లోపు ————– మహిళ ———– 7.05% ——- ——- 6.75 శాతం
——————————— ఇతరులు ——- 7.10 % ——- —– — 6.80 శాతం
రూ.30-75 లక్షల మధ్య —— మహిళ ———– 7.30% ——- —– — 7.00 శాతం
——————————— ఇతరులు ——- 7.35 % ——- —– — 7.05 శాతం
రూ.75 లక్షల పై చిలుకు —- మహిళ ———– 7.40% ——- ——– 7.10 శాతం
——————————— ఇతరులు ——— 7.45 % ——- ——- 7.15 శాతం
ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై ఆర్పీఎల్ఆర్ ఐదు బేసిక్ పాయింట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆర్పీఎల్ఆర్ అమల్లోకి తెచ్చింది.