బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇండియన్ సినిమాకు అందించిన సేవలకుగాను ఈ ఏడాది ఎఫ్ఐఏఎఫ్ అవార్డును అందుకోనున్నాడు. ఈ అవార్డును ప్రతి ఏటా ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ అందిస్తుంది. అయితే ఈసారి అమితాబ్‌కు మాత్రం హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లు మార్టిన్ స్కోర్సీస్, క్రిస్టొఫర్ నోలాన్లు ఈ అవార్డు ఇవ్వనున్నారు. సినిమాకు అమితాబ్ అందించిన సేవలను ఈ ఇద్దరూ కొనియాడారు. ఇండియన్ సినిమాను సంరక్షించడంలో అమితాబ్ పాత్ర ఎనలేనిది. ఐదు దశాబ్దాల కెరీర్లో ఇండియన్ సినిమాతోపాటు మొత్తం భారత ఉపఖండంలో ఆయన తనదైన ముద్ర వేశారు అని మార్టిన్ స్కోర్సీస్ అన్నారు. ఈ ఏడాది అవార్డు అందుకుంటున్న బిగ్ బీకి నోలాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవార్డు రావడం తనకు గొప్ప గౌరవమని అమితాబ్ అన్నాడు.