ఎస్సై జాబ్ కోసం వచ్చి దొంగబుద్ధి చూపించాడు ఓ యువకుడు. ఎలాగైనా ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలని కాపీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అందరిలా స్లిప్పులు పెట్టలేదు. హైటెక్ కాపీయింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం నెత్తికి విగ్గు.. ఆ విగ్గులో మొబైల్ తరహాలో కాల్స్ చేయడానికి వీలుగా ఒక డివైజ్ పెట్టుకున్నాడు. చెవిలో మైక్రో బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష హాల్‌కు వచ్చాడు. కానీ మొదట్లోనే అతని మోసం బయటపడిపోయింది. ఎగ్జామ్ హాల్‌కు వెళ్లేముందు అక్కడే ఉన్న సిబ్బంది మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేశారు. డిటెక్టర్ తలపై పెట్టగానే సౌండ్ రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతన్ని క్షుణ్నంగా పరిశీలించారు. అప్పుడు మనోడు పెట్టిన విగ్.. చెవిలో బ్లూటూత్ అన్నీ బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్వీట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియో మీకోసం..