తమిళ దర్శకుడు శంకర్ కి టైమ్ బాలేనట్లుంది. వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న భారతీయుడు 2 ఇప్పుడు హిందీ అపరిచితుడు సినిమాకి కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు శంకర్ కి ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లేఖ రాయడం హాట్ ఆఫ్ ది మ్యాటర్ గా మారింది.
అపరిచితుడు కథ హక్కులు నావేనని తనని సంప్రదించకుండా హిందీలో ఇదే కథతో సినిమా తీస్తే న్యాయమైర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ లేఖలో స్పష్టం చేశారు. అయితే నిజంగా ఇది ఆస్కార్ రవిచంద్రన్ రాసిన లేఖనా లేదంటే ఫేకా అన్నది తెలియాల్సి ఉంది.