Dussehra Celebrations | కరోనా కారణంగా రెండు దసరాలూ నిశ్శబ్దంగా వచ్చి వెళ్లిపోయాయి. దాదాపు రెండేండ్ల తర్వాత మునుపట్లా ప్రజలంతా కలిసి మెలిసి పండుగ చేసుకుంటున్నారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దాండియా.. దసరా అంటేనే సరదా. ఈ నవరాత్రులను వైభవోపేతంగా జరుపుకొంటామని చెబుతున్నారు ఈ సెలెబ్రిటీలు..
రెండేండ్లుగా ప్రపంచానికి పండుగలూ వేడుకలూ లేవు. ఇప్పుడిప్పుడే ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం. నవరాత్రి రోజుల్లోనూ నేను షూటింగ్లో పాల్గొనాల్సి వస్తున్నది. దసరా కోసమే కొన్ని షూటింగ్స్ క్యాన్సిల్ చేసు కున్నాను. జనజీవనం సాధారణ స్థితికి రావడం, అంతా కలిసి వేడుకలు చేసుకోవడం ఆనందంగా అనిపిస్తున్నది. దసరా రోజున దాండియాతో సందడి చేయాలనుకుంటున్నా. అందరికీ పండుగ శుభాకాంక్షలు.
ప్రతి పండుగనూ నేను ఆనందంగా జరుపుకొంటాను. నా దృష్టిలో దసరా.. సాదాసీదా వేడుక కాదు. ఇందులో ఆధ్యాత్మికత ఇమిడి ఉంది. ఈసారి బంధువులు, స్నేహితులను కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ నవరాత్రికి మా ఇంట్లో కంజాక్ పూజా (కన్యకలతో పూజ) నిర్వహిస్తున్నాం. మీరు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా.
దసరా వచ్చిందంటే మా ఇంట్లో సందడే వేరు. ఇంట్లో, ఆఫీస్‌లో ప్రత్యేకంగా నవరాత్రి పూజలు చేస్తాం. ఫ్రెండ్స్‌తో గార్బా పార్టీలకూ హాజరవుతాను. అయితే, ఈసారి మేము దసరా రోజు ఇండియాలో ఉండటం లేదు. విదేశాలకు వెళ్తున్నాం. అక్కడే వేడుకలు చేసుకుంటాం. ప్రవాసులకు కూడా ఇష్టమైన పండుగ ఇది.
Pridhvi Raj | పృథ్విరాజ్‌కు షాకిచ్చిన ఫ్యామిలీ కోర్టు.. భరణంగా నెలకు రూ.8 లక్షలు ఇవ్వాలంటూ తీర్పు