Hero XPulse 200 4V |దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ విపణిలోకి న్యూ ఎక్స్‌పల్స్ 200 4వీని ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో దీని ధర రూ.1.28 లక్సలుగా ప్రకటించారు. ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్లో ఫోర్ వాల్వు టెక్నాలజీ అందిపుచ్చుకుని హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ విపణిలోకి వస్తోంది.
199.6 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ గల ఈ బైక్.. 8,500 ఆర్పీఎం వద్ద 18.8 బీహెచ్పీ, 6,500 ఆర్పీఎం వద్ద 17.35 ఎన్ఎం పీక్టార్చ్తో హెడ్‌లైట్‌తో వస్తోంది. టూ వాల్వ్ వర్షన్లో ఇదే ఇంజిన్ 17.8 బీహెచ్పీ, 16.45 ఎన్ఎం పీక్ టార్చితో డెవలప్ చేశారు. టూ వాల్వ్ వర్షన్ ఇంజిన్ బైక్‌తో పోలిస్తే తాజా హీరో ఎక్స్ ప్లస్ 200 4వీ బైక్ పవర్ ఐదు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగింది. అలాగే టూ వాల్వ్ ఎక్స్ ప్లస్ 200 4వీతో పోలిస్తే తాజా బైక్ ధర రూ.5000 ఎక్కువ.
బెటర్ హీట్ డిస్సిపేషన్కు 7ఫిన్ ఆయిల్ కూలర్‌తో అప్డేటెడ్ కూలింగ్ సిస్టం అమర్చారు. బెటర్ ట్రాక్టబిలిటీ, యాక్సిలరేషన్ కోసం రివైజ్డ్ గేర్ రేష్యూను అప్డేట్ చేసిన గేర్బ్యాక్ కూడా జత కలిసింది. మోటార్ సైకిల్ వెళుతున్నప్పుడు వైబ్రేషన్స్ కనీస స్థాయికి తగ్గుతాయని హీరో మోటో కార్ప్స్ వెల్లడించింది.
హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ మూడు రంగుల్లో.. ట్రయల్బ్లూ, బ్లిట్జ్ బ్లూ, రెడ్ రైడ్ రంగుల్లో వస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్, ఇంజిన్ కట్-ఆఫ్ స్విచ్ జత కలిసిన స్విచ్ గేర్ కూడా యాడ్ అవుతున్నది. ఇక శక్తిమంతమైన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్టృమెంట్ కన్సోల్, సింగిల్ చానెల్ ఏబీఎస్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
190 ఎంఎం ట్రావెల్‌తో అప్ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, 170 ఎంఎం ట్రావెల్ 10 స్టెప్ అడ్జస్టబుల్ మొనోసాక్ రేర్ సస్పెన్షన్, డ్యూయల్ పర్పస్ టైర్స్ కూడా జత కలిశాయి. న్యూ సైడ్ స్టాండ్, నాబీ టైర్స్, ఫ్లాట్ శాడిల్, లాంగర్ ట్రావెల్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు కూడా చేర్చారు.