Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్జరీ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడే ఆయన సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల కింద ప్రభాస్.. తన కొత్త మూవీ సలార్ షూటింగ్లో గాయపడినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే ఆయన స్పెయిన్‌లో సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సర్జరీ కోసమే ప్రభాస్.. స్పెయిన్ వెళ్లారట. సర్జరీ విజయవంతం అయిందని తెలుస్తోంది. అయితే.. కొన్ని రోజుల పాటు ప్రభాస్‌ను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు కోరారట. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్.. ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే రాధే శ్యామ్ మూవీ రిలీజ్ అయింది.