Hero Moto Corp | పండుగల సీజన్ ప్రారంభంలోనే ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్స్.. గట్టి షాక్ ఇచ్చింది. అన్ని రకాల టూ వీలర్స్ మీద రూ.1000 ధర పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ధర పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. ముడి సరుకు ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణానికి దారి తీయడంతో పాక్షికంగానైనా ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది.
ఆయా మోడల్ బైక్ లేదా స్కూటర్‌ను ధర పెంపు ఖరారవుతుందని హీరో మోటో కార్ప్ ప్రకటించింది. దేశంలోని టూ వీలర్స్ మార్కెట్లో హీరో మోటో కార్ప్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఎంట్రీ లెవెల్ `హెచ్ఎఫ్ 100 నుంచి ఎక్స్ పల్స్ వరకు ఉన్నాయి. ఆయా బైక్‌ల ధరలు రూ.55,450 నుంచి రూ.1.36 లక్షల మధ్య పలుకుతున్నాయి.